గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (17:28 IST)

ప్రాచీన హోదా.. తెలుగు భాషకు అన్నీ అర్హతలున్నాయ్ : మద్రాస్ హైకోర్టు

తమిళనాట నిర్భంధ తమిళంతో తెలుగు భాష పరిరక్షణ కోసం పాటుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళ భాషలు కాని భాషలకు ప్రాచీన హోదా కల్పించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఫైర్ అయ్యింది. ప్రాచీన హోదా పొందేందుకు తెల

తమిళనాట నిర్భంధ తమిళంతో తెలుగు భాష పరిరక్షణ కోసం పాటుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళ భాషలు కాని భాషలకు ప్రాచీన హోదా కల్పించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఫైర్ అయ్యింది. ప్రాచీన హోదా పొందేందుకు తెలుగు భాషకు అన్ని అర్హతలున్నాయని మద్రాసు హైకోర్టు పేర్కొంది. 
 
తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాది రవీంద్రనాథ్‌, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక సంఘం సంచాలకుడు మామిడి హరికృష్ణ ధర్మాసనానికి వివరాలు సమర్పించారు.
 
వాదనలు ముగిసిన అనంతరం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. తెలుగుకు ప్రాచీన హోదా పొందేందుకు అన్ని అర్హతలున్నాయని, ఇంకా నింబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని హైకోర్టు స్పష్టం చేసింది.