'నేటి భారత్ 1962లో ఉన్నప్పటి భారత్ కాదు' : అరుణ్ జైట్లీ
సిక్కిం, 'డోక లా' ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం దృష్ట్యా భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోక లా పై వెనక్కి తగ్గకుంటే యుద్ధానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. దీనికి ప్రతిగా
సిక్కిం, 'డోక లా' ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం దృష్ట్యా భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోక లా పై వెనక్కి తగ్గకుంటే యుద్ధానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. దీనికి ప్రతిగా భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ధీటుగానే స్పందించారు. ‘నేటి భారత్ 1962లో ఉన్నప్పటి భారత్ కాదు’ అని జైట్లీ పేర్కొన్నారు. 'ఆయన నిజమే చెప్పారు. అలాగే, ఇప్పుడు చైనా కూడా వేరు' అని గెంగ్ పరోక్ష హెచ్చరికలు జారీచేశారు. తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు అవసరమైన ‘అన్ని’ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
'భారత సేనలు మా భూభాగంలో అడుగుపెట్టడం నిజం. కానీ... దీనిని సమర్థించుకునేందుకు భూటాన్‌ను వాడుకుంటున్నారు. నిజానికి... భారత్ సేనలు భూటాన్ సార్వభౌమత్వాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. భారత్ చెబుతున్నట్లుగా... ఆ దేశ బలగాలు డోకా లా ప్రాంతంలోకి ప్రవేశించినట్టు తొలుత భూటాన్‌కు కూడా తెలియదు. భారత్, భూటాన్‌లతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు ఇప్పటికీ సిద్ధమే. కానీ... భూటాన్‌ను తెరపైకి తెచ్చి మా భూభాగంలోకి అడుగుపెట్టిన భారత్ వెంటనే వెనక్కి తగ్గాలి' అని గెంగ్ షరతు విధించారు.