శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:35 IST)

ఆ సమాజం చిన్మయానందను బహిష్కరించింది మరి!

ఒకప్పుడు ఉవ్వెత్తున వెలిగి ఇటీవల అత్యాచారం కేసులో అరెస్టయిన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందను సంత్ సమాజ్ నుంచి బహిష్కరించాలని అఖిల భారతీయ అఖారా పరిషత్ (ఏబీఏపీ) నిశ్చితాభిప్రాయంతో వచ్చింది.

దీనిపై నిర్ణయం తీసుకునేందుకు అక్టోబర్ 10న హరిద్వార్‌లో అఖారా పరిషత్ సమావేశమవుతోంది. కోర్టు నుంచి ఆయన నిర్దోషిగా విడుదలయ్యేంత వరకూ ఆయనపై బహిష్కరణ వేటు కొనసాగుతుందని ఏబీఏపీ వర్గాలు తెలిపాయి.

చిన్మయానంద తనపై అత్యాచారం చేసినట్టు లా విద్యార్థిని ఒకరు నెలరోజుల క్రితం చేసిన ఫిర్యాదుతో గత శుక్రవారంనాడు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అత్యాచారం, వేధింపులు, నేరపూరిత బెదరింపుల కింద ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి.

సహజాన్‌పూర్‌లోని స్థానిక కోర్టు ముందు పోలీసులు ఆయనను హాజరుపరచడంతో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆయనను కోర్టు అప్పగించింది. తనపై ఉన్న సాక్ష్యాలన్నింటినీ చిన్మయానందం ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

సంత్ సమాజ్‌కు చెందిన ఒక వ్యక్తి తనను, తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదరిస్తున్నట్టు బాధితురాలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వ్యవహరించింది. అయితే అప్పుడు ఆమె చిన్మయానంద పేరు వెల్లడించలేదు. ఆ తర్వాత ఆగస్టు 24న ఆమె జాడ తెలియకుండా పోయింది.

ఆరు రోజుల తర్వాత ఆమె రాజస్థాన్‌లో కనిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అదే రోజు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.