ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (14:38 IST)

నోట్ల రద్దుపై సభలో మాట్లాడే ధైర్యం ప్రధాని మోడీకి లేదు: ఎంపీ దినేష్

పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడే ధైర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద నోట్ల రద్దు అంశం

పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడే ధైర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద నోట్ల రద్దు అంశంపై ఉభయ సభలను కుదిపేస్తోంది. పెద్ద నోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ అన్ని విపక్ష పార్టీల నేతలు పట్టుబడుతున్నారు. కానీ, ప్రధాని మాత్రం ఉభయ సభల మొహం కూడా చూడటం లేదు. 
 
దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ దినేష్ గుండురావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ రాను రాను నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరికీ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రధాని ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. 'ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ప్రధానికి పార్లమెంటd ఒక్క ముక్క కూడా మాట్లాడాలని అనిపించడం లేదు. ఆయన రాను రాను మరింత నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
పెద్ద నోట్ల రద్దుపై జపాన్‌, గోవా, కర్నాటక, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల మాట్లాడగా లేనిది.. పార్లమెంటులో మాట్లాడేందుకు ఆయన ఎందుకు వెనక్కితగ్గుతున్నారని ప్రశ్నించారు. 'దురదృష్టమేంటంటే... పార్లమెంటుకు వచ్చి తోటి పార్లమెంటు సభ్యులతో మాట్లాడాలన్న ఆసక్తి కూడా ప్రధానమంత్రికి లేనట్టు కనిపిస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేయడానికి కారణమేంటి, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారనే దానిపై వివరణ ఇచ్చి సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేయ్యెచ్చు కదా?' అని దినేశ్ వ్యాఖ్యానించారు.