శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (13:05 IST)

వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ

sonia gandhi
ఇటీవల కరోనా వైరస్ సోకడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమె ఆరోగ్యంపై పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరామ్ రమేష్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
సోనియా గాంధీకి శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారని, దాంతో పాటు కరోనా తదనంతర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. సోనియా ప్రస్తుతం వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతుందని తెలిపింది.
 
కాగా, ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరగా, ఆ సమయంలో ఆమె ముక్కు నుంచి రక్తం రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమెకు గురువారం ఉదయం మరోమారు వైద్య పరీక్షలు చేశారు.