శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (07:51 IST)

పురుషుల్లారా! పారాహుషార్.. కరోనా మరణాలు పురుషుల్లోనే అధికం

కరోనా పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందా?.. కరోనా మరణాలు వారిలోనే అధికంగా వున్నాయా?.. అవుననే అంటున్నాయి వివిధ అధ్యయనాలు. కరోనా కారణంగా మహిళల కంటే 50 నుంచి 80 శాతం ఎక్కువ మరణాలు పురుషుల్లో సంభవిస్తున్నాయి.

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువ చనిపోతున్నారు. కరోనా కారణంగా సగటున ప్రతి పదివేల మందిలో 43 మంది పురుషులు, 23 మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ పరిణామానికి కొన్ని శాస్త్రీయ అంశాలు దోహదంచేస్తే, నిర్లక్ష్య ధోరణి మరో కారణంగా నిలుస్తోంది. ఈ సమయంలో వైరస్‌ సోకకుండా నివారణ చర్యలను పాటించడమే తక్షణ కర్తవ్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.