శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (20:53 IST)

కోవిడ్-19: వృద్ధులకు కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య సూచనలు

కోవిడ్-19 వైరస్ ప్రభావం వృద్ధులపై అధికంగా ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ హెచ్చరించింది. సాధారణంగా వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి తక్కువ ఉండటం వల్ల వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉండడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

నోవెల్ కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో మన ఇంట్లో 50ఏళ్లకు పైబడిన వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ ఇదివరకే జారీ చేసింది. అదే సమయంలో కోవిడ్ పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకు దిగువ ప్రతిపాదించిన చర్యలను తీసుకోవాల్సిందిగా సూచించింది.  
 
* వృద్ధులలో రోగనిరోధక శక్తి మరియు శరీర పటుత్వము తక్కువగా ఉంటుంది. అలాగే బహుళ అనుబంధ వ్యాధుల వల్ల కోవిడ్-19 వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వృద్ధులు ఇంట్లోనే ఉండాలి, సందర్శకులను కలవకుండా ఉండాలి. ఒకవేళ కలవాల్సి వస్తే కనీసం ఒక మీటరు దూరం పాటించాలి.
 
* సబ్బు మరియు నీటితో క్రమం తప్పకుండా చేతులు, ముఖం కడగడం, దగ్గేటప్పుడు  తుమ్మేటప్పుడు మోచేయిని అడ్డుపెట్టడం, టిష్యూ పేపర్ వాడి పారవేయడం లేదా రుమాలును ఉపయోగించి తరువాత శుభ్ర పరచడం లాంటివి అలవాటు చేసుకోవాలి.
 
* తాజాగా ఇంట్లో వండిన వేడి భోజనం తీసుకుంటూ, ఒంట్లో తరచూ హైడ్రేటింగ్ మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి తాజా పళ్లరసాలు తీసుకోవాలి.
 
* వృద్ధులు కంటి శుక్లం, మోకాలి మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకోవాలి. ఆరోగ్య సంరక్షణకు ఎప్పటికప్పుడు వైద్యులను ఫోన్ లో సంప్రదించి తదనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
 
* పార్కులు, మార్కెట్లు, మత సంబంధమైన ప్రదేశాలు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదు
 
కోవిడ్ బారినపడిన వృద్ధుల మరణాల రేటు తగ్గించేందుకు మార్గదర్శకాలు:
కరోనా పాజిటివ్ పేషెంట్లలో 60ఏళ్లకు పైబడిన వారి మరణాల రేటును తగ్గించేందుకు దిగువ ప్రతిపాదించిన చర్యలను తీసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతోంది.  
 
1. 60 సంవత్సరాల పై బడిన వారికి వెంటనే ట్రూనాట్ టెస్ట్ ను చేయాలి. ఒకవేళ పాజిటివ్ అని వస్తే వెంటనే ఈ కింది ప్రొటోకాల్ పాటించాలి.
 
2. ట్రునాట్ పరీక్ష ద్వారా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఊహాజనిత సానుకూల కేసులుగా పరిగణించబడతాయి. ఈ కేసులనన్నింటినీ దగ్గరలో ఉన్న కోవిడ్ హాస్పటల్ కు తరలించి ఎవరితోనూ కలిసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కేసులన్నింటికి మరుసటి రోజు RT-PCR టెస్ట్ చేయాలి.
 
3.  ఇంకా క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని అనుమానిత కేసులలో సింప్టోమాటిక్, కోవిడ్ పాజిటివ్ కేసుల యొక్క ప్రైమరీ మరియు సెంకండరీ కాంటాక్ట్) 60 ఏళ్లు పైబడిన వారిందర్నీ వేరుగా ఉంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  
 
4. అన్ని క్వారంటైన్ కేంద్రాలలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి కోవిడ్ సంక్రమించకుండా 60ఏళ్లకు పైబడిన వారందరిని విడివిడిగా ఐసోలేషన్ లో ఉంచాలి.