అనుమానభూతం ప్రేమికులను మింగేసింది.. ప్రేయసిని చంపి ఉరేసుకున్న ప్రియుడు.. ఎక్కడ?
అనుమానం ఇద్దరి జీవితాలను బలి తీసుకుంది. తనను కాదని ఇంకొకరితో సంబంధం పెట్టుకుందన్న కసితో ఓ ప్రియుడు పథకం ప్రకారం ప్రియురాలిని హత్య చేసి తర్వాత తాను కూడా సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత‍్మహత్య చేసుకున్నాడ
అనుమానం ఇద్దరి జీవితాలను బలి తీసుకుంది. తనను కాదని ఇంకొకరితో సంబంధం పెట్టుకుందన్న కసితో ఓ ప్రియుడు పథకం ప్రకారం ప్రియురాలిని హత్య చేసి తర్వాత తాను కూడా సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత‍్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఇండోర్కు చెందిన సోను ఢిల్లీలో డాన్స్ స్కూలు నడుపుతుంటాడు. అక్కడ డాన్స్ నేర్చుకోడానికి వచ్చిన యోగితతో మొదటిచూపులోనే ప్రేమలో పడ్డాడు. అలా కొద్దిరోజులు వీరి ప్రేమాయణం సాఫీగా సాగింది. కొద్దిరోజులు గడిచిన తర్వాత ఆమెని వేరే మగాళ్లతో మాట్లాడకూడదని చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో ఆమెకు వేరేవాళ్లతో సంబంధం ఉందని సోను అనుమానించేవాడు. ఈ క్రమంలో యోగితను హతమార్చాలని కుట్ర పన్నాడు.
రెండు రోజుల ముందుగానే హత్య - ఆత్మహత్యలకు పథకం వేశాడు. ముందుగా ఓ కరెంట్ వైరు తీసుకొచ్చి క్లాసులో పెట్టికున్నాడు. క్లాస్ సమయాన్ని కూడా మార్చాడు. రెండు రోజుల క్రితం తన వాట్సప్ స్టేటస్ను కూడా ''నేను మరో తప్పు చేశాను'' అని మార్చాడు. తన విద్యార్థులతో ఎప్పటికి డాన్స్ మాత్రం మానొద్దని హితవు పలికాడు.
కాగా ఎప్పటిలాగానే తనని కలవడానికి వచ్చిన యోగిత పీకకు కరెంటువైరు బిగించి చంపి, ఆమె దుపట్టాతోనే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్నాడు. మర్నాటి ఉదయం అకాడమీని శుభ్రం చేయడానికి పని మనిషి వచ్చినపుడు ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.