శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 10 మే 2017 (10:49 IST)

అత్తమ్మ ఆస్తులన్నీ నాకూ నా చెల్లెలికే.. వీలునామా నా దగ్గరే వుంది: దీపక్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అత్త, జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామా తన దగ్గర ఉందని చెప్పారు. గతంలో అమ్మ అక్రమాస్తుల కేసులో జయకు న్యాయస్థానం విధించిన జరిమానాను కట్ట

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అత్త, జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామా తన దగ్గర ఉందని చెప్పారు. గతంలో అమ్మ అక్రమాస్తుల కేసులో జయకు న్యాయస్థానం విధించిన జరిమానాను కట్టేస్తానని దీపక్ ప్రకటించారు. "అత్తమ్మ జయలలిత రాసిన వీలునామా తన దగ్గరే వుందన్నారు. 
 
"అన్ని ఆస్తులూ నా పేరిట, నా సోదరి దీప పేరిట రాసి ఉన్నాయి" అంటూ జయలలిత మేనల్లుడు దీపక్‌ సంచలన వ్యాఖ్యలు చేయడంతో శశికళ వర్గం షాక్‌కు గురైంది. ఈ వీలునామా ప్రకారం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని బంగ్లా, చెన్నై పార్సన్‌ మేనర్‌లో రెండు ఆఫీసులు, సెయింట్ మేరీస్ రోడ్డులోని నివాసం, కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్‌లోని ద్రాక్ష తోట వంటి ఎనిమిది ఆస్తులు తనకు దక్కుతాయని దీపక్ జయకుమార్ తెలిపారు. 
 
ఇకపోతే.. జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో పలు అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌ బంగ్లాలో హత్య, దోపిడీ జరిగాయి. జయలలిత ఆస్తుల వివరాలు, పార్టీకి సంబంధించిన కీలక పత్రాలు, భారీ ఎత్తున డబ్బు ఉందని.. అందుకే అక్కడ హత్య, దోపిడీలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.