శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 మే 2021 (21:10 IST)

భార్య మీద భర్తకు కోపం.. ముక్కు కొరికేశాడు..

భార్యమీద భర్తకు కోపం రావడం సహజమే. అయితే ఈ భర్తకు ఏకంగా భార్య ముక్కు కొరికేసింత కోపం వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
 
భర్త ప్రవర్తనలతో విసిగిపోయిన ఆ భార్య భర్తనుంచి దూరంగా వెళ్లిపోయింది. కానీ అతను వదల్లేదు. వెతుక్కుంటూ వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. ఆ గొడవలో ఆమె ముక్కు కొరికేశాడు. పైగా ఏదో కోపంలో కొరికేసాను అంటూ చెప్పుకొచ్చాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన విజేందర్ పాల్ అనే 36 ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల క్రితం ప్రేరణ సైనీని అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పాల్ ఢిల్లీలోని పతర్‌గంజ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. వారికి ప్రస్తుతం 11 ఏళ్ల కూతురు ఉంది. భర్త ప్రవర్తన నచ్చక 11 ఏళ్ల కూతురుని తీసుకుని ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లిపోయింది. 
 
అయితే.. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలుసుకున్న ఆమె భర్త ఆమెను కలుసుకున్నాడు. భర్తతో వెళ్లేందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆమె భర్త కోపంతో ఊగిపోయాడు. ఆమె ముక్కును కొరికేశాడు. 
 
గాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు 15 కుట్లు పడ్డాయని తెలిపింది. తన భర్తను కొందరు స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.