శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (13:47 IST)

ఢిల్లీలో మహిళా డాక్టర్ దారుణ హత్య

ఢిల్లీలో ఓ మహిళా వైద్యురాలు దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంటి పక్కనే ఉండే ఇద్దరు వ్యక్తులే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని రంజిత్‌ నగర్‌కు చెందిన ఓ మహిళ ఎంబీబీఎస్‌ చదివి మాస్టర్స్‌ కోసం ప్రిపేరవుతున్న గరీమా మిశ్రా అనే వైద్యురాలు విగతజీవిగా పడివుండటాన్ని పోలీసులు గుర్తించారు. 
 
ఆమె గొంతు కోసి హతమార్చినట్టు ఆనవాళ్లు లభించాయి. కాగా హత్య జరిగిన అనంతరం ఆమె పొరుగున ఉండే ఇద్దరు వ్యక్తులు కనిపించకపోవడంతో హత్యతో వారికి సంబంధం ఉందనే అనుమానాలు బలపడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరితో ఆమె సన్నిహితంగా ఉండేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్నేహితుడు సైతం ఎండీ కోర్సుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.