సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (18:45 IST)

మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో దాచిన ప్రియుడు.. అదే రోజు పెళ్లి చేసుకుని..

crime news
ఢిల్లీలో ఘోరం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని కిరాతకంగా హత్య చేశాడు ఓ ప్రియుడు. అంతేకాకుండా మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో దాచాడు. అదే రోజు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఢిల్లీలో మూసి వున్న దాబాలోని ఫ్రిడ్జ్‌లో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. 
 
నాలుగు రోజుల క్రితం ప్రియుడు ఆమెను హత్య చేసి అందులో దాచాడని విచారణలో వెల్లడి అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఐదేళ్ల పాటు ప్రేమించి సహజీవనం చేసిన ఆ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.