మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 జూన్ 2017 (11:33 IST)

చిన్నారిపై అత్యాచారం చేస్తూ పట్టుబడిన కామాంధుడు.. చితక్కొట్టి చంపేసిన స్థానికులు

ఢిల్లీలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేస్తూ ఓ కామాంధుడు పట్టుబడ్డాడు. అంతే.. ఆ కామాంధుడిని స్థానికులు చితక్కొట్టి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే...

ఢిల్లీలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేస్తూ ఓ కామాంధుడు పట్టుబడ్డాడు. అంతే.. ఆ కామాంధుడిని స్థానికులు చితక్కొట్టి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే... 
 
తూర్పు ఢిల్లీలోని పాండవ నగర్‌కు చెందిన 25 సంవత్సరాల గోలు అనే వ్యక్తి, తిను బండారాలు కొనిస్తానని చెప్పి నాలుగేళ్ళ చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు. ఈ చిన్నారి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఊరిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో సంజయ్ లేక్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గోలు కనిపించాడు. ఆ వెంటనే బిడ్డపై అత్యాచారం చేసేందుకే గోలు ఇక్కడికి తీసుకొచ్చాడని ఆరోపిస్తూ, రాళ్లతో కొట్టి కర్రలతో దాడి చేశారు. 
 
వీరి దాడిలో గోలు అపస్మారక స్థితిలోకి వెళ్లగా, విషయం తెలుసుకున్న పోలీసులు స్పందించి, గోలును లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం జీటీబీ ఆసుపత్రికి తరలించగా, అతను మరణించాడు. గోలు మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసని, కేసును నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని, దాడి చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు వెల్లడించారు.