సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 జులై 2017 (09:47 IST)

అత్యాచారాలకు నిలయంగా మారిన ఢిల్లీ.. ఇద్దరు మైనర్లు.. మతిస్థిమితం లేని మహిళపై?

దేశ రాజధాని నగరం ఢిల్లీ అత్యాచారాలకు నిలయంగా మారిపోతుంది. ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇంకా ఢిల్లీలో అకృత్యాల పర్వం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చిన మరో మూడు ఘటనలు

దేశ రాజధాని నగరం ఢిల్లీ అత్యాచారాలకు నిలయంగా మారిపోతుంది. ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇంకా ఢిల్లీలో అకృత్యాల పర్వం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చిన మరో మూడు ఘటనలు మహిళల ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ముగ్గురు మహిళలపై అత్యాచారం జరగగా వీరిలో ఇద్దరు మైనర్లు వున్నారు. మరొకరు మతిస్థిమితం లేని మహిళపై కూడా కామాంధులు విరుచుకుపడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కమలా మార్కెట్ ప్రాంతంలో ఉండే 36 ఏళ్ల వ్యక్తి ఎనిమిదేళ్ల బాలికపై తన కుమార్తె ఎదురుగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో ఘటన కన్నాట్‌ప్లేస్‌లో జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై ఆమె తండ్రి స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక మూడో ఘటన దారుణం. ఇది తూర్పు ఢిల్లీలో జరిగింది. 38 ఏళ్ల మతిస్థిమితం లేని మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ముగ్గురు రేపిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.