గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (09:10 IST)

దినకరన్‌పై ప్రశ్నల వర్షం... ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం...

అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల గుర్తు రెండాకుల గుర్తును తిరిగి తమ వశం చేసుకునేందుకు ఏకంగా ఎన్నికల సంఘం అధికారికి ముడుపుల ఆశ చూపారన్న ఆరోపణలపై అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవి దినకరన్ ఆదివారం కూడా పోలీ

అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల గుర్తు రెండాకుల గుర్తును తిరిగి తమ వశం చేసుకునేందుకు ఏకంగా ఎన్నికల సంఘం అధికారికి ముడుపుల ఆశ చూపారన్న ఆరోపణలపై అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవి దినకరన్ ఆదివారం కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు. దినకరన్‌పై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేయడం ఖాయమని చెబుతున్నారు. 
 
ఈ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీకి వచ్చి తమ ఎదుట హాజరుకావాలంటూ పోలీసులు చెన్నైకు వచ్చి సమన్లు ఇచ్చి వెళ్లిన విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీకి వెళ్లిన దినకరన్... శనివారం మధ్యాహ్నం నుంచి జరిగిన విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు అడిగిన ప్రశ్నలకు దినకరన్ సక్రమంగా సమాధానాలు చెప్పకపోవడంతో, రాత్రి వరకూ విచారణ కొనసాగింది. 
 
ఈ సమాధానాలతో తృప్తి చెందక పోవడంతో ఆదివారం కూడా విచారణకు పిలిచి విచారించారు. ఈ విచారణ సోమవారం కూడా జరిగే అవకాశం ఉంది. కాగా, ఢిల్లీ పోలీసు స్టేషనలో ప్రత్యేక గదిలో దినకరన్‌ను, అరెస్టయిన బ్రోకర్‌ సుఖేశ్ చంద్రాను ప్రశ్నిస్తూ విచారణ జరిపారు.