బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 నవంబరు 2016 (09:36 IST)

ఢిల్లీలో మరో హిట్ రన్ కేసు.. తప్పతాగి కారు నడిపిన మహిళ.. ఇద్దరు కూలీలు మృతి..

తప్పతాగి మగరాయుళ్లే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. తిక్క తిక్కగా ప్రవర్తిస్తారు. అయితే ప్రస్తుతం సీన్ మారింది. మహిళలే తప్పతాగి రోడ్డుపైకి వచ్చి నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందే చోటు

తప్పతాగి మగరాయుళ్లే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. తిక్క తిక్కగా ప్రవర్తిస్తారు. అయితే ప్రస్తుతం సీన్ మారింది. మహిళలే తప్పతాగి రోడ్డుపైకి వచ్చి నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందే చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ మహిళ తప్పతాగి కారుతో బీభత్సం సృష్టించింది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 
 
పోలీసుల కథనం ప్రకారం.. న్యూఢిల్లీకి చెందిన ప్రీతి భరద్వాజ్(36) కారు(మారుతి స్విఫ్ట్)లో బుధవారం రాత్రి హర్యానాలోని కర్నాల్ సమీపంలోని జాతీయరహదారిపై వెళ్తోంది. రోడ్డు పక్కన వెళ్తున్న ఐదుగురు వ్యక్తులపై నుంచి ప్రీతి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
ఫ్లై ఓవర్ నిర్మాణం పనుల్లో బిజీగా ఉన్న కొందరు వ్యక్తులను ఢిల్లీ మహిళ కారుతో ఢీకొట్టిందని, ఇద్దరు చనిపోగా.. ముగ్గురు గాయపడ్డారని స్టేషన్ ఇన్‌చార్జ్ రాజ్‌బీర్ సింగ్ యాదవ్ చెప్పారు. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా ఆమె అలాగె వెళ్తుండగా స్థానికులు ఛేజ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. డ్రైవింగ్‌లో సదరు మహిళ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
 
ప్రీతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని కర్నాల్ చేరుకున్న ప్రీతి పేరేంట్స్ ఈ ఘటనపై షాక్‌కు గురయ్యారు. ఢిల్లీ మహిళపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.