ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..
ఢిల్లీ వాసులను భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున భయపెట్టింది. ఉదయం 5.36 గంటలకు రాజధాని దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టల్ స్కేలుపై దాని తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలోనే భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు భూతీయ భూకంపం కేంద్రం తెలిపింది.
ఢిల్లీ ఇపుడే భూకంపంల సంభవించింది. తాత్కాలిక ముఖ్యమంత్రి అతిశీ తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. భూప్రకంపనల కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అన్నీ ఊగిపోయాయని, ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారని రైల్వే స్టేషన్ వ్యాపారి ఒకరు తెలిపారు.
రైలు భూమి కింద నుంచి వెళుతున్నట్టు అనిపించిందని స్టేషన్‌లోనే ప్రయాణికులు పేర్కొన్నారు. ఇక, ఘజియాబాద్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భవనం మొత్తం ఊగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గతంలో ఎపుడూ ఇలా చూడలేదని ఆయన పేర్కొన్నారు. నోయిడా, గుర్గావ్, ఫరిదాబాద్, ఘజియాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ఈ ప్రకంపనలు కూడా కనిపించాయి.