నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)
కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగర సమీపంలోని నెలమంగళ టోల్‌ప్లాజాలో ఓ ఆరాచక ఘటన జరిగింది. టోల్‌గేట్ వద్ద ఓ వ్యక్తిని కారు ఒకటి కొంతదూరం లాక్కెళ్లి పడేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
పోలీసుల కథనం మేరకు ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే, టోల్‌గేట్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టోల్‌గేట్ వద్ద ఓ కారును మరోకారు ఓవర్ టేక్ చేయడంతో సదరు కారులో వ్యక్తి... ముందుకు వచ్చి కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించాడు. దీంతో టోల్ బూత్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ముందు కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆవేశంతో రగిలిపోయాడు.
ఈ క్రమంలోనే కారు స్టార్ట్ చేసి వాగ్వాదానికిదిగన వ్యక్తి కాలర్ పట్టుకుని ముందుకు పోనిచ్చాడు. ఆ తర్వాత కారు ఆ వ్యక్తిని దాదాపు 50 మీటర్ల దూరం కారు ఈడ్చుకెళ్లింది. కొంతదూరం వెళ్లాక అతడిని వదిలిపెట్టడంతో ఆయన కిందపడిపోయాడు. కారు డ్రైవర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.