సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (18:58 IST)

ఏనుగు ఆకులు తింటుంటే.. కళ్లప్పగించి చూస్తున్న చిరుత... (వీడియో)

Tiger
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. క్రూరమృగాలకు సంబంధించిన వీడియోలో నెట్టింట చక్కర్లు కొట్టిన సందర్భాలున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. చిరుత పులి.. ఏనుగు ఆకులు తింటున్న సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఒక పెద్ద ఏనుగు, ఒక చిరుత పులి. రెండూ పక్కపక్కనే ఉన్నాయి. 26 సెకండ్లపాటు నడిచే ఈ వీడియోలో చిరుత పులి ఒక బండపై కూర్చొని ఉంది. దానికి సమీపంలోనే చెట్టు కొమ్మ ఆకులను ఏనుగు తింటూ ఉంది. 
 
ఏనుగు ఆకుల్ని తింటున్నంతసేపు ఏమనకుండా చిరుత ఆశ్చర్యంగా కళ్లప్పగించి చూస్తోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విటర్‌లో షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోకు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా ఈ వీడియోకు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 'చిరుతపులి కూడా వీక్షణను ఆస్వాదిస్తోంది' అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు.