శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 14 జులై 2020 (23:14 IST)

చైతు లవ్ స్టోరీ షూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్..!

అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీనికి తోడు నాగచైతన్య నటించిన మజిలీ, వెంకీమామ చిత్రాలు వరుసగా సక్స్ సాధించడంతో లవ్ స్టోరీతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని.. అభిమానులు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
 
ఎప్పుడెప్పుడు లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటే.. కరోనా వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. లవ్ స్టోరీ రిలీజ్ కి బ్రేక్ పడింది. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్‌కి పర్మిషన్ ఇచ్చినా... షూటింగ్స్ చేయలేని పరిస్థితి. దీంతో ఎప్పుడు కరోనా కరుణిస్తుందా..? మళ్లీ గతంలా అందరూ ఆనందంగా ఉంటారా..? ఎప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతాయా..? అని ఎదురు చూస్తున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... లవ్ స్టోరీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడంటే... రామోజీ ఫిలింసిటీలో అని సమాచారం. లవ్ స్టోరీ షూటింగ్ చేయడానికి రామోజీ ఫిలింసిటీలో సెట్ రెడీ చేస్తున్నారు. ఆగష్టు 20 నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు.
 
15 రోజులు షూటింగ్ చేయాల్సివుందని తెలిసింది. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి దసరాకి రిలీజ్ చేసేందుకు రెడీ చేయాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. లవ్ స్టోరీ దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. లేకపోతే... సంక్రాంతికి లవ్ స్టోరీ రిలీజ్ కావచ్చు.