సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జులై 2020 (20:13 IST)

జబర్దస్త్ షోపై పంజా విసిరిన కరోనా.. హైపర్ ఆది టీమ్‌లో ఒకరికి కోవిడ్

కరోనా వైరస్ జబర్దస్త్ షోను వదల్లేదు. జబర్దస్త్ షోలో నవ్వులు పూయించే హైపర్ ఆది టీమ్‌ను కరోనా కలవరపెడుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పునః ప్రారంభమైన జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోను కరోనా వైరస్ వెంటాడుతోంది. సిబ్బంది అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా భయాందోళనలకు గురిచేస్తోంది. హైపర్ ఆది టీమ్‌లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకింది. 
 
ముందు కాస్త జ్వరంగా అనిపించడంతో సదరు వ్యక్తి టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలింది. అంతకుముందే హైపర్ ఆది టీమ్‌తో కలిసి పనిచేసినట్టు తెలిపాడు. దాంతో హైపర్ ఆది టీమ్ హోమ్ క్వారంటైన్‌కు వెళ్ళిపోయారు. జబర్దస్త్ నిర్వాహకులు షోను మరలా కొన్ని రోజుల వరకు ఆపేశారు. తెలుగు ప్రజలను ఎంతగానో అలరించే ప్రోగ్రామ్ జబర్దస్త్‌ టీమ్‌ను కరోనా పలకరించడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.