మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 20 మే 2017 (15:50 IST)

టెన్త్ పరీక్షలు రాస్తే ఇంటర్‌లో ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణత.. హౌ? ఇది మాజీ సీఎంకే చెల్లుతుంది!

సాధారణంగా పదో తరగతి పరీక్షలు రాస్తే పదో తరగతిలోనే ఉత్తీర్ణులవుతారు. కానీ, ఇక్కడ పరిస్థితి విరుద్ధం. టెన్త్ పరీక్షలు రాస్తే.. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులయ్యారు. అదీ ఏ గ్రేడ్‌లో. మరీ ముఖ్యంగా.. 82 యేళ్ళ

సాధారణంగా పదో తరగతి పరీక్షలు రాస్తే పదో తరగతిలోనే ఉత్తీర్ణులవుతారు. కానీ, ఇక్కడ పరిస్థితి విరుద్ధం. టెన్త్ పరీక్షలు రాస్తే.. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులయ్యారు. అదీ ఏ గ్రేడ్‌లో. మరీ ముఖ్యంగా.. 82 యేళ్ళ వయసులో... ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన రాజకీయ కురువృద్ధుడు. ఇంతకీ ఆ ఘనుడు ఎవరన్నదే కదా మీ సందేహం. ఆయన ఎవరో కాదు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధినేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓ ప్రకాష్ చౌతలా. 
 
హర్యానా రాష్ట్రంలో జరిగిన జూనియర్ బేసిక్ ట్రైనింగ్ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో చౌతాలా దోషిగా తేలడంతో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ప్రస్తుతం ఈయన తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడ ఉంటూనే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. కానీ, ఆయన ఏ గ్రేడ్‌లో ఇంటర్‌లో పాసైనట్టు ఆయన తనయుడు అభయ్ సింగ్ ప్రకటించారు. 
 
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్)లో ఓం ప్రకాష్ చౌతలా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. తన తండ్రి తీహార్ జైలులో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో గత నెల ఎన్‌ఐఓస్ ఇంటర్ పరీక్షలు రాసి పాసయ్యారని, 82 ఏళ్ల వయసులోనూ ఏ గ్రేడ్ సాధించారని చౌతాలా కొడుకు అభయ్ సింగ్ ఇటీవలే మీడియాకు వెల్లడించారు.
 
అయితే చౌతాలా అడ్మిషన్ తీసుకున్నది, పరీక్ష రాసింది పదో తరగతి పరీక్షలని ఎన్‌ఐవోఎస్ అధికారులు స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఇంటర్ ఎలా పాసవుతారని కూడా వారు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పైగా, ఎన్‌ఐఓఎస్ ఆధ్వర్యంలో జరిగిన పది, ఇంటర్ ఫలితాలు ఇంకా వెలువడనే లేదు. మొత్తానికి ఈ తండ్రీ కొడుకుల తెలివితేటల్లో ఒకరిని మించిన మరొకరన్నమాట.