శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2016 (15:28 IST)

గాలి జనార్థన్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతుందా? రమేష్ గౌడ ఆత్మహత్యే కారణమా?

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కూతురు వివాహం కోసం రూ.100 కోట్ల పాత నోట్లను వైట్‌గా మార్చుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కూతురు వివాహం కోసం రూ.100 కోట్ల పాత నోట్లను వైట్‌గా మార్చుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ అధికారి వద్ద పనిచేసే డ్రైవర్ రమేష్ గౌత మృతి నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. తాను పనిచేసే అధికారి భీమా నాయక్ వద్ద గాలి జనార్థన్ రూ.100 కోట్ల నల్ల ధనాన్ని వైట్‌గా మార్చుకున్నట్లు రమేష్ సూసైట్ నోట్లో పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో గాలికి సన్నిహితుడైన సదరు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రత్యేక భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న భీమా నాయక్.. గాలికి రూ.100కోట్ల పాత నోట్లను వైట్ మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడి వ్యక్తిగత డ్రైవర్ మహ్మద్‌లను ఆదివారం గుల్బర్గాలో అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రమేష్ గౌడ అధికారి భీమా నాయక్ వద్ద డ్రైవర్‌గా పని చేశాడు. 
 
కాగా, మాండ్యలోని ఓ లాడ్జిలో రమేష్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన వంద కోట్ల రూపాయలను 20 శాతం కమిషన్ మీద భీమా నాయక్ వైట్‌గా మార్చారని ఆత్మహత్య నోట్‌లో రమేష్ గౌడ పేర్కొన్నారు.