మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (18:48 IST)

కాల్చి పడేసిన సిగరెట్ పీక... 150 కార్లను బుగ్గి చేసింది...(Video)

కాల్చి పడేసిన ఓ సిగరెట్ పీక 150 కార్లను బుగ్గి చేసింది. ఈ ఘటన బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌ సమీపంలో ఏరో ఇండియా షో-2019 జరుగుతుండగా చోటుచేసుకుంది. శనివారం నాడు ఉదయం ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరుగుతోంది. ఇంతలోనే కార్ పార్కింగ్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడం మొదలయ్యాయి. అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. 
 
పార్కింగ్ ఏరియాలోకి వచ్చేలోపే మంటలు విపరీతంగా అన్నివైపులా చుట్టేశాయి. పార్కింగ్ ఏరియాలో మొత్తం 200 కార్లు వుండగా చూస్తుండగానే 150 కార్లు కాలిపోయాయి. హుటాహుటిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కారులో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని కొందరు అంటుంటే... ఓ వ్యక్తి కాల్చి పడేసిన సిగరెట్ వల్ల ఈ ఘటన జరిగిందంటున్నారు. విచారణలో నిజం తేలాల్సి వుంది.. వీడియో చూడండి..