శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (16:01 IST)

గడ్డి స్కామ్‌లో లాలూ ప్రసాద్‌ దోషి : సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు

దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఈ మేరకు రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది.

దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఈ మేరకు రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది. అలాగే, మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.  
 
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991–94 కాలంలో దియోగఢ్ ‌(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. 
 
దీంతో లాలూ సహా మొత్తం 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్‌ 27న చార్జిషీట్‌ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. మిగిలిన వారంతా శనివారం కోర్టుకు హాజరయ్యారు. 
 
ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది. తీర్పు సందర్భంగా తన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి సీబీఐ ప్రత్యేక కోర్టుకు వచ్చిన లాలూ ప్రసాద్‌కు ఊరట లభించలేదు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష కాలాన్ని జనవరి మూడో తేదీన ఖరారు చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.