సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2017 (10:26 IST)

ఢిల్లీలో దారుణం.. లిఫ్ట్ ఇస్తామని కారెక్కించుకున్నారు.. ఆపై మహిళపై గ్యాంగ్ రేప్

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. లిఫ్ట్ ఇస్తామంటూ నలుగురు యువకులు ఓ మహిళను కారెక్కించుకొని తిరుగుతూ కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఢిల్లీ నగర శివార్ల

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. లిఫ్ట్ ఇస్తామంటూ నలుగురు యువకులు ఓ మహిళను కారెక్కించుకొని తిరుగుతూ కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఢిల్లీ నగర శివార్లలోని తిమార్ పూర్ గ్రామం వద్ద తెలిసిన నలుగురు యువకులు లిఫ్ట్ ఇస్తామంటూ ఓ మహిళను కారు ఎక్కించుకున్నారు. 
 
ఢిల్లీ శివార్లలోని రోహిణి, ఉత్తర ఢిల్లీ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం దుండగులు స్పృహ కోల్పోయిన మహిళను హీరాంకీ గ్రామం వద్ద వదిలేసివెళ్లారు. స్పృహలోకి వచ్చిన బాధిత మహిళ అలీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.