శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (18:17 IST)

నాలుగేళ్ల బాలికపై 22ఏళ్ల వ్యక్తి అత్యాచారం: అలా లొంగదీసుకుని..?

మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో పొరుగున నివసిస్తున్న నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
 
22 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను ఏదో సాకుతో నిందితుడు తన వద్దకు రప్పించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తన ఇంటి నుంచి ఏడుస్తూ, నొప్పితో విలపిస్తూ బయటకు వచ్చిందని పోలీసు ఇన్‌స్పెక్టర్ దిలీప్ దహియా తెలిపారు. 
 
బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లల వార్డులో చికిత్స పొందుతోంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.