శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2017 (14:18 IST)

కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తే గెలుపే.. సీఎం కావడం ఖాయం.. జోస్యం

తమిళనాడు రాజకీయాల్లో సినీ లెజెండ్ కమల్ హాసన్ అడుగెడితే తప్పకుండా ఆయన సీఎం అవుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ద

తమిళనాడు రాజకీయాల్లో సినీ లెజెండ్ కమల్ హాసన్ అడుగెడితే తప్పకుండా ఆయన సీఎం అవుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రజలు రాజకీయాలంటేనే ఫైర్ అవుతున్నారు.

పదవుల కోసం అన్నాడీఎంకేలోని కొందరు చేస్తున్న చర్యలతో ఆ పార్టీకి బలమైన నాయకత్వం కరువైంది. ఓపీఎస్ పార్టీ కోసం పోరాడుతున్నా ఫలితం లేకుండా పోయింది. ీ నేపథ్యంలో ఇటీవలే తమిళనాడులో ఎన్నికలు జరగాలని కమల్ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సీఎం పళనిస్వామి ఫైర్ అయ్యారు. అయితే కమల్‌కు మద్దతు పెరిగిపోతోంది. నడిగర్ సంఘం ఇప్పటికే తన మద్దతును ప్రకటించింది.  
 
ఇక తన అభిమానుల సంఘాల ద్వారా సంక్షేమ పనుల్ని సైలెంట్‌గా చేసుకుంటూ పోతున్న కమల్ హాసన్.. లేటెస్టుగా ట్విట్టర్, ఫేస్ బుక్‌ల ద్వారా రాజకీయాంశాలపై ఎలాంటి జంకుబొంకు లేకుండా స్పందిస్తున్నారు. దీనిని నెటిజన్లు సైతం స్వాగతిస్తున్నారు. ఇటీవల శశికళ ప్రభుత్వాన్ని కమల్ ఏకిపాకేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని కుప్పకూల్చి.. కొత్త ప్రభుత్వం కోసం ఎన్నికలు జరగాలన్నారు. ప్రజలకు నచ్చిన నాయకుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాలన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను సీఎం పళనిస్వామితో పాటు శశి అనుచరులు, అన్నాడీఎంకే నేతలు తప్పుబట్టారు. దీంతో కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రం చేయాలని పలువురు ఆయన్ని డిమాండ్ చేశారు. కానీ కమల్ హాసన్ తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదన్నారు. 
 
ఈ పరిస్థితులలో కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ఆయనే సీఎం అవుతారని ప్రముఖ జ్యోతిష్యలు జోస్యం చెప్పేశారు. కమల్ హాసన్ మీన రాశికి చెందినవారు కావడంతో నవంబర్‌కు తర్వాత, కుజ దశ ప్రారంభం అవుతుంది. కమల్ జాతకంలో కుజుడు మకరంలో ఉచ్ఛస్థానంలో ఉండటం ద్వారా పార్టీ ప్రారంభిస్తే తప్పకుండా ఎన్నికల్లో గెలుపొందుతారని జోస్యం చెప్పారు. అయితే దైవభక్తిపై నమ్మకం లేని కమల్ హాసన్.. ఈ జ్యోసాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది వేచి చూడాలి.