శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (15:14 IST)

యుక్త వయసులో కోరికలు నియంత్రణలో పెట్టుకోకపోతే కేరీర్ నాశనం : కోర్టు

యుక్త వయసులో కలిగే లైంగిక కోరికలకు నియంత్రణలో పెట్టుకోకలేకపోతే కేరీర్‌ను నాశనం చేస్తుందని ముంబైలోని ఓ ఫోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే, తన స్నేహితుడి భార్యాపై అత్యాచారానికి పాల్పడిన 20 యేళ్ల యువకుడికి పదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలో స్నేహితుడి భార్యపై 20 యేళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, ఈ కేసు విచారణ ముంబై ఫోక్సో కోర్టులో జరిగింది. 
 
ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "పురుషుడు స్నేహితురాలిని కలిగివుండటం అంటే.. అతడి లైంగిక కోర్కెలు తీర్చడానికి ఆమె ఉన్నట్టు కాదు" అని న్యాయమూర్తి ప్రీతమ్ కుమారు గులే వ్యాఖ్యానిచారు. 
 
అంతేకాకుండా, లైంగిక సంతృప్తిని పొందేందుకు నియంత్రణలో పెట్టుకోలేని కోరికలు యుక్త వయసులోని వారి కెరీర్‌, బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తుందని అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.