శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (02:43 IST)

సైతాన్ ప్రవేశించింది కాబట్టే అమ్మాయిలు జీన్స్ వేస్తున్నారు: చర్చి పాస్టర్ బాధ

జీన్స్ వంటి ఆధునిక దుస్తులు వేసుకుని అమ్మాయిలు చర్చికి వస్తుంటే తాము పాపాలకు గురౌతామని అబ్బాయిలు వాపోతున్నట్లు ఓ క్రైస్తవ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. పైగా పురుషులను రెచ్చగొట్టే విధంగా మహిళలు దుస్తులు ధరించకూడదంటూ ఆ ఫాదర్ చేసిన

జీన్స్ వంటి ఆధునిక దుస్తులు వేసుకుని అమ్మాయిలు చర్చికి వస్తుంటే తాము పాపాలకు గురౌతామని అబ్బాయిలు వాపోతున్నట్లు ఓ క్రైస్తవ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. పైగా పురుషులను రెచ్చగొట్టే విధంగా మహిళలు దుస్తులు ధరించకూడదంటూ ఆ ఫాదర్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. తిరువనంతపురంకు చెందిన పాస్టర్ సెర్మోన్ వీడీయో వీడియో ఫేస్‌బుక్‌లో సంచలనం సృష్టిస్తోంది. వీడియోలో ఆయన ఏమన్నారంటే.. కొన్ని చర్చిల్లో చెప్పినట్లు పెద్ద గుంపుకు తాను బోధనలు చేయనని చెప్పారు. అలాంటి చోట్ల అమ్మాయిలు ముందు వరుసలో మోడరన్‌ వేర్‌ ధరించి.. సెల్‌ఫోన్‌ను చేతిలో పట్టుకుని కూర్చుంటారని అది తనకు నచ్చదని తెలిపారు. కనీసం జుత్తును కూడా వారు సరిగా దువ్వుకుని రారని.. చర్చికి వచ్చే సమయంలో కూడా ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు ఇప్పటివరకూ అర్ధం కాలేదని చెప్పారు.
 
పైగా అలా దుస్తులు ధరించి చర్చికి రావొచ్చా అని ఆయన సభకు వచ్చిన అమ్మాయిలను ప్రశ్నించారు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ధరిస్తున్న దుస్తులపై తనకు ఫిర్యాదు చేసినట్లు సెర్మొన్‌ చెప్పారు. అలాంటి వారిని చర్చి వద్ద చూస్తుంటే తాము పాపాలకు గురౌతామని అబ్బాయిలు వాపోయినట్లు తెలిపారు. 
 
మహిళలు వాళ్ల సమస్యలపై ఫిర్యాదులు (పెళ్లి ఎందుకు జరగడం లేదనో, ఉద్యోగం ఎందుకు రావడం లేదనో తదితరాలపై) చేస్తారని.. అందుకు కారణం వారు ధరిస్తున్న దుస్తులేనని అన్నారు. చుడీదార్లు చాలా చక్కగా ఉంటాయని అమ్మాయిలు వాటినే ధరించాలని అన్నారు. కొంతమంది అమ్మాయిల్లో సతాను ప్రవేశించిందని అందుకే మోడరన్‌ దుస్తుల వైపు ఆకర్షితులౌతున్నారని చెప్పారు.
 
అమ్మాయిలు బిగుతు దుస్తులు వేసుకుని రెచ్చగొడుతుండటం వల్లే దేశంలో వారిపై అత్యాచారాలు ఎక్కువవుతున్నాయని, సెల్‌ఫోన్ చేతిలో ఉన్న అమ్మాయి చెడిపోయిందానితో సమానమని, కాలేజీల్లో, బహిరంగ స్థలాల్లో అమ్మాయిలు జీన్స్ వేయకుండా  నిషేధించాలని.. ఇలా రకరకాలుగా మహిళలు దుస్తులు, వేషధారణపై, వారి అభిరుచులపై వ్యాఖ్యానాలు చేసే ప్రబుద్ధులు విచ్చలవిడిగా మీడియా ముందుకు వస్తున్నారు. ఇంతమంది అంటుంటే నేను తక్కువేంటి అన్న విధంగా క్రిస్టియన్ పాస్టర్ కూడా అమ్మాయిల వస్త్రధారణపై వ్యాఖ్యకు దిగిపోవడం వింతగొలుపుతోంది. 
 
మూడేళ్ల పసిపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు. వీరు కూడా అసభ్యంగా దుస్తులు ధరించారనే ఆ చిన్నారులపై వేదింపులకు పాల్పడుతు్న్నారా అంటూ సినీనటి స్నేహ నాలుగు రోజుల క్రితం వేసిన ప్రశ్న ఇంకా మనలో గింగిరాలు తిరుగుతూనే ఉంది. కానీ పాస్టర్‌కు కూడా ఈ పాడుబుద్దేమిటో?