శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 మార్చి 2017 (09:02 IST)

చక్రం తిప్పిన మనోహర్ పారీకర్ .. బీజేపీ ఖాతాలో గోవా

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అంటే మ్యాజిక్ మార్కుకు ఆరు సీట్ల దూరంలో వచ్చి నిలిచింది. దీంతో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ రాత్రికి రాత్రే పనాజీకి చేరుకుని చక్రం తిప్పా

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అంటే మ్యాజిక్ మార్కుకు ఆరు సీట్ల దూరంలో వచ్చి నిలిచింది. దీంతో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ రాత్రికి రాత్రే పనాజీకి చేరుకుని చక్రం తిప్పారు. మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో నలుగురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించేలా ఒప్పించారు. దీంతో గోవాలో మళ్లీ బీజేపీ పాలన రానుంది. 
 
శనివారం వెల్లడైన గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 14 సీట్లు వచ్చాయి. 19 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు రెండు సీట్ల దూరంలో ఆగిపోయింది. మొత్తం 40 సీట్లున్న గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 21. దీంతో రంగంలోకి దిగిన మనోహర్ పారీకర్... ఎంజీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో నలుగురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించేలా ఒప్పించారు. 
 
దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమనే ఆహ్వానిస్తారని బీజేపీ భావిస్తోంది. మరోవైపు 19 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ఆశగా ఉంది.