నగదు రహిత రాష్ట్రమా.. కుదరదు... గోవాను చేయలేం : రక్షణ మంత్రి మనోహర్
దేశాన్ని నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే మోడీ ప్రభుత్వ చర్యలు కూడా ఉన్నాయి. అయితే, మోడీ మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న మనోహర్
దేశాన్ని నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే మోడీ ప్రభుత్వ చర్యలు కూడా ఉన్నాయి. అయితే, మోడీ మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న మనోహర్ పారికర్ నగదు రహిత లావాదేవీలపై యు టర్న్ తీసుకున్నారు.
తన స్వరాష్టమైన గోవాని పూర్తిగా నగదురహిత రాష్ట్రంగా చేయడం సాధ్యంకాదని ఆయన తేల్చేశారు. కేవలం 50 శాతం లావాదేవీలనే నగదురహితంగా మార్చాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. పూర్తి నగదురహిత లావాదేవీలన్నవి అభిలషణీయం కూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కేవలం సొమ్ము వినియోగాన్ని తగ్గించడానికే ఇది ఉద్దేశించిందని పారికర్ అన్నారు. సాధ్యమైన చోట డిజిటల్ తరహాలో చెల్లింపులు జరపడం మేలని అన్నారు. డిజిటల్ లావాదేవీలను 50 శాతం పెంచాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.