50 మంది బాలికలపై ప్రభుత్వోద్యోగి అత్యాచారం..ఎక్కడో తెలుసా?

rape
ఎం| Last Updated: గురువారం, 19 నవంబరు 2020 (08:27 IST)
పదేళ్లుగా 50 మంది బాలికలపై ఓ ప్రభుత్వోద్యోగి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన యూపీలో వెలుగు చూసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఓ జూనియర్‌ ఇంజనీర్‌ను ఎట్టకేలకు సిబిఐ అధికారులు అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.

కేసు వివరాలు పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామ్‌భవన్‌ అనే వ్యక్తి ఇరిగేషన్‌ శాఖలో జూనియర్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వరిస్తున్నాడు. పైకి ఎంతో బాధ్యతగా కనిపించే ఇతను కనిపించిన ప్రతి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టేవాడు.

చిత్రకూట్‌, హామీర్పూర్‌, బండా ప్రాంతాల్లో పేద బాలికలను టార్గెట్‌గా చేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫొటోలు, వీడియోలు తీసి ఇతరులకు పంపించేవాడని తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎరగా వేసి బెదిరించేవాడని దర్యాప్తులో తేలింది.

గతంలో ఎప్పటి నుండో ఇతనిపై లైంగిక ఆరోణలున్నప్పటికీ సాక్ష్యాలు లభించలేదు. దీంతో యుపి పోలీసులు ఈ కేసును సిబిఐకి అప్పగించారు. సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం అతని నివాసంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

పెద్దఎత్తున సిడిలు, మొబైల్‌ఫోన్లు, కొంతమంది బాలికల ఫొటోలు బయటపడ్డాయి. దీంతో అతనిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై యూపీనే కాకుండా యావత్‌ దేశం విస్తుపోయింది.
దీనిపై మరింత చదవండి :