మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (22:02 IST)

ఏడేళ్ల కూతురున్న తల్లిపై అత్యాచారం.. పోలీసులకు కంప్లైంట్ చేశారని..?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఏడేళ్ల కూతురున్న తల్లిపై అత్యాచారానికి పాల్పడిన దుండగుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో మరోసారి ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. కుటుంబం మొత్తానికి నిప్పు పెట్టి కాల్చేయడానికి ప్రయత్నించడంతో తీవ్రగాయాల పాలై గవర్నమెంట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. 
 
అక్టోబర్ 31న 32ఏళ్ల మహిళ ఇంట్లో ఉండగా చొరబడిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి ఎవ్వరికీ చెప్పొద్దని హెచ్చరించాడు. భర్తతో పాటు పిల్లలకు ఘటన గురించి చెప్పిన ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకోలేదు. ఆ తర్వాత మళ్లీ అతణ్ని కలవాలని, ఒంటరిగా రమ్మంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు.
 
దానికి నిరాకరించిన మహిళ.. భర్త సాయంతో స్టేషన్‌కు వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ గురించి తెలుసుకున్న పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులకు వెళ్లగా అతని తల్లి తన కొడుకుకు గాయాలయ్యాయని హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని చెప్పింది.
 
మహారాష్ట్రలోని గ్వాలియర్ పోలీస్ సూపరిండెంట్ అమిత్ సంఘీ మాట్లాడుతూ.. ఘటనపై ఎంక్వైరీ చేస్తున్నామని.. తాటిపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి అత్యాచారం దాడి కంప్లైంట్ నమోదు కాలేదని చెప్పారు. నిందితుడ్ని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపారు.