సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (16:09 IST)

సవతి తండ్రి ఘాతుకం.. పదేళ్ల చిన్నారిపై రేప్.. ఐదునెలల గర్భవతిని చేశాడు..

సవతి తండ్రి బుద్ధి చూపాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తెపై కన్నేశాడు. అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. రోహ్‌తక్‌లో శనివారం జరిగిన నిర్భయ ఘటనను మరువక

సవతి తండ్రి బుద్ధి చూపాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తెపై కన్నేశాడు. అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. రోహ్‌తక్‌లో శనివారం జరిగిన నిర్భయ ఘటనను మరువకముందే హర్యానాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోహ్‌తక్‌కు చెందిన పదేళ్ల చిన్నారిపై సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
చిన్నారి తరచూ అనారోగ్యం బారిన పడుతుండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకురావడంతో అసలు విషయం బయటపడింది. ఆ పాప ఐదు నెలల గర్భవతి అని.. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. తనపై లైంగిక దాడిని చిన్నారి తల్లికి చెప్పడంతో.. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.