గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (10:27 IST)

నన్ను ప్రధానిని చేస్తే కాశ్మీర్ సమస్య పరిష్కరించేస్తా: అజంఖాన్

భారతదేశానికి ప్రధానమంత్రిని అయ్యే అర్హత తనకు ఉందనీ, కానీ, ముస్లిం కావడం వల్లే ఆ పదవిని అధిరోహించలేక పోతున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో తాను ప్రధానిని అయితే కా

భారతదేశానికి ప్రధానమంత్రిని అయ్యే అర్హత తనకు ఉందనీ, కానీ, ముస్లిం కావడం వల్లే ఆ పదవిని అధిరోహించలేక పోతున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో తాను ప్రధానిని అయితే కాశ్మీర్ సమస్యను పరిష్కరించేస్తానని ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ముస్లిం మతస్తుడిని కావడం వల్లే తాను ప్రధాని పదవిని పొందలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని అయ్యేందుకు కావలసిన అర్హతలన్నీ తనకు ఉన్నాయని, అయితే, తాను ముస్లిం మతస్థుడిని కావడమే ప్రధాన సమస్యగా పరిణమించిందన్నారు. 
 
తనను కనుక ప్రధానిని చేస్తే, కేవలం ఏడాదిలోపే కాశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తెస్తానని.. అఖండ భారత్‌ను నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. ఇకపోతే... యురీ సెక్టార్‌పై ఉగ్రదాడులను పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.