శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (15:31 IST)

వంద మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు.. డబ్బు, బంగారాన్నే కాదు.. శీలాన్ని కూడా?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వంద మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి.. వారి వద్ద నగదు, బంగారంతో పాటు వారి శీలాన్ని కూడా దోచుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 28 ఏళ్ల సదా

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వంద మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి.. వారి వద్ద నగదు, బంగారంతో పాటు వారి శీలాన్ని కూడా దోచుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 28 ఏళ్ల సదాక్ ముష్తక్ అనే వ్యక్తి.. అమ్మాయిలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. యువతులకు తాను ఉన్నత ఉద్యోగంలో ఉన్నానని చెప్పడం.. అమ్మాయిలను ట్రాప్‌లో పెట్టాక.. వారి నమ్మించి డబ్బు తీసుకోవడం.. ఆపై వారిని లోబరుచుకోవడం చేశాడు. అయితే బాధిత మహిళలు సదాక్‌పై ఫిర్యాదు చేయలేదు. 
 
కానీ మిష్తక్‌పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై లైంగిక దాడి చేశాడంటూ పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. విచారణ సందర్భంగా ముష్తక్ చెప్పిన నిజాలు విని పోలీసులు షాక్ అయ్యారు. 
 
దాదాపు 75 నుంచి 100 మంది మహిళలను ప్రేమ పేరుతో మోసం చేసి లోబరుచుకున్నట్లు తెలియవచ్చింది. ప్రేమిస్తున్నానని మహిళలను లైంగికంగా వాడుకోవడంతో పాటు.. డబ్బు, బంగారాన్ని కూడా లాగేసుకునే వాడని తెలిసింది. ఆపై వారికి కూడా దూరమయ్యేవాడని తెలిసింది. ఈ వ్యవహారాన్ని.. సదాక్ తన 18వ ఏటనే ప్రారంభించాడని.. 2007 నుంచి అమ్మాయిల్ని మోసం చేయడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.