శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (15:42 IST)

ఢిల్లీ ఐఐటీ ఫ్లైఓవర్ పక్కనే భారీ గొయ్యి...

దేశ రాజధాని ఢిల్లీలోని రహదారులన్నీ నిత్యం బిజీగా ఉంటాయి. అలాంటి రహదారులపై ఉన్నఫళంగా పెద్ద గొయ్యిలు పడుతున్నాయి. తాజాగా ఓ ఫ్లైఓవర్ పక్కన భారీ గొయ్యి పడింది. దీన్ని చూసిన వాహనదారులు షాక్‌కు గురయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నిత్యం రద్దీగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంతం రోడ్డంతా బిజీబిజీగా ఉంటుంది. అలాంటి చోట ఫ్లై ఓవర్ కింద రోడ్డుపై భారీ గొయ్యి పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. 
 
భారీ గొయ్యి పడడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అక్కడి నుంచి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. ఐఐటీ నుంచి అధ్చినికి వెళ్లే వాహనాలను కత్వారియా సరాయి మీదుగా మళ్లించారు. 
 
కాగా, దాదాపు 10 నుంచి 15 అడుగుల లోతుతో ఆ గొయ్యి ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రజాపనుల విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గొయ్యిని పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.