శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 జులై 2021 (13:37 IST)

శివకాశీలోని బాణాసంచా తయారీ యూనిట్​లో భారీ పేలుడు

శివకాశీ బాణాసంచా తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ దీపావళి కోసం బాణాసంచా తయారు చేస్తారు. తరచూ పేలుళ్లు సంభవిస్తున్నా అప్రమత్తంగా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా శివకాశీలోని బాణాసంచా తయారీ యూనిట్​లో భారీ పేలుడు జరిగింది. 
 
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి బాణసంచా తయారీలోని కార్మికులు ఎగిరిపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. 
 
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కర్మాగారంలో 20 మంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తున్నారు. చిక్కుకున్న వారికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
 
ఈ ప్యాక్టరీలో బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. పేలుడు సమయంలో కార్మాగారం నిర్వాహకులు ఘటనా స్థలంలో లేరని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.