శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (11:42 IST)

జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన నగరం

ప్రపంచంలోనే అతి పెద్ద నౌకాశ్రయంగా పేరుగాంచిన జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. భారత ఉపఖండంతో పాటు, ఆఫ్రికా, ఆసియాకు ఇక్కడి నుంచి సరుకుల రవాణా జరుగుతుంది. అలాంటి పోర్టులో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోర్టులోని ఓ కంటెయినర్ షిప్‌కు ఆ మంటలు అంటుకుని, ఈ భారీ పేలుడు సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ విస్ఫోటనం జరిగింది. 
 
ఈ ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
 
పేలుడు శబ్దం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టామని, బయటకు వచ్చి చూస్తే ఆకాశమంతా ఎరుపు రంగులోకి మారిపోయి ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.