ఎట్టకేలకు ఏక్‌నాథ్ ఖాడ్సే రాజీనామా: దావూద్‌తో సంబంధాలు రుజువైతే..?!
మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖాడ్సే ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏక్‌నాథ్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ బీష్మించుకు కూర్చున్న మంత్రిగారు పెద్దల జోక్యంతో పదవి నుంచి తప్పుకున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను శనివారం కలిసిన ఖాడే తన రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామా చేసిన అనంతరం ఖాడ్సే మీడియాతో మాట్లాడారు. 'దావూద్ ఇబ్రహీంతో ఫోన్‌లో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. బీజేపీని అప్రతిష్టపాలు చేసే కుట్రలో భాగమే ఇది. నేను తప్పుచేసినట్టు ఎవరైనాసరే రుజువులు చూపిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటాను' అని ఖాడ్సే వ్యాఖ్యానించారు.
అక్రమ భూకేటాయింపులలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలు, దావూద్ ఇబ్రహీం ఫోన్ రికార్డులలో కూడా ఖడ్సే నెంబరు ఉందని ఒక హ్యాకర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.