బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 డిశెంబరు 2023 (11:11 IST)

భార్య నల్లగా వుందని విడాకులు కోరిన భర్త

woman
ఇటీవలి కాలంలో చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తలు విడాకుల తీసుకునేందుకు కోర్టు మెట్లెక్కుతున్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఓ భర్త తన భార్య నల్లగా వుందంటూ వేధించడం మొదలుపెట్టాడు. తన భార్య నల్లగా వున్నందున ఆమెతో కాపురం చేయలేననీ, విడాకులు మంజూరు చేయాలంటూ ఛత్తీస్ గఢ్ కోర్టులో పిటీషన్ వేసాడు. 
 
ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు, భార్య నల్లగా వున్నదంటూ వివక్ష చూపిస్తూ విడాకులు కోరడాన్ని తోసిపుచ్చింది. అతడి పిటీషన్ కొట్టివేసింది. కాగా ఈ విచారణకు హాజరైన మహిళ... తనను పెళ్లాడిన దగ్గర్నుంచి నల్లగా వున్నానంటూ తన భర్త వేధిస్తున్నాడనీ, తమ పెళ్లి 2005లో అయ్యిందని తెలిపింది. ఐతే పెళ్లయిన దగ్గర్నుంచి తను నల్లగా వున్నానంటూ వేధింపులకు గురి చేయడంతో పుట్టింటికి వెళ్లిపోయినట్లు చెప్పింది.