గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (13:16 IST)

ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత సత్తా.... గొప్ప శారీరక బలం ఉన్న నేత : శశిథరూర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఓ న్యూస్ చానల్‌‌తో థరూర్ మాట్లాడుతున్నపుడు మోడీలో మీకు నచ్చిన అంశం ఏమిటని ఛానల్ ప్రతినిధి ప్ర

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఓ న్యూస్ చానల్‌‌తో థరూర్  మాట్లాడుతున్నపుడు మోడీలో మీకు నచ్చిన అంశం ఏమిటని ఛానల్ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ... నరేంద్ర మోడీ వ్యక్తిగత సత్తాగల నేత అన్నారు. ఆయనకు గొప్ప శారీరక బలం ఉందన్నారు. 
 
ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన క్షణం తీరిక లేకుండా విదేశీ పర్యటనలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అలా దేశవిదేశీ ప్రయాణాల్లో తిరుగుతున్నప్పటికీ నరేంద్ర మోడీ అలసిపోయిన ఛాయలేవీ మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. 
 
ఉపన్యాసాలు, సమావేశాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారని, అయినప్పటికీ ఆయన వాగ్ధాటి, ఉత్సాహం ఏ మాత్రం సడలిపోవడం లేదని ప్రశంసించారు. ఆయన పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ ఆయనలోని ఈ లక్షణం మెచ్చుకోదగినదేనన్నారు.