శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (14:19 IST)

అసెంబ్లీలో డీఎంకే కార్యకర్తలు జుట్టు పట్టుకుని, చీర లాగితే.. ఎన్టీఆర్ పద్యమే గుర్తొచ్చింది..

తమిళనాడు సీఎం జయలలిత జీవితంలో ఎన్నో పోరాటాలు, సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన సతీమణి వర్గీయులు జయలలితను అవమానానికి గురిచేశారు. ఇదే తరహాలో రాజకీయాల్లో డీఎంకే నుంచి జయకు పలు సవాళ్లు ఎ

తమిళనాడు సీఎం జయలలిత జీవితంలో ఎన్నో పోరాటాలు, సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన సతీమణి వర్గీయులు జయలలితను అవమానానికి గురిచేశారు. ఇదే తరహాలో రాజకీయాల్లో డీఎంకే నుంచి జయకు పలు సవాళ్లు ఎదురైనాయి. ఎన్నికల నుంచి అసెంబ్లీ వరకు పథకాల నుంచి వాటిని అమలు చేసేంతవరకు రాజకీయ ప్రత్యర్థి అయిన డీఎంకే నుంచి జయలలిత ఎన్నో కష్టాలు, నష్టాలు తప్పలేదు. 
 
ఇలాంటి ఘటన 1989 మార్చి 25వ తేదీ చోటుచేసుకుంది. తమిళనాడు అసెంబ్లీ వేదికగా ఈ అవమానం జరిగింది. డీఎంకే కార్యకర్తలు చేతికి అందిన వస్తువు తీసి ఆమెపై విసిరారు. ఆమె జుట్టు, చీర పట్టుకుని లాగారు. అసెంబ్లీ నుంచి ఆమె శరీరంపై గాయాలతో, చిరిగిన చీరతో, చెదిరిన జుట్టుతో, దెబ్బతిన్న పులిలా అగ్నికణాల్లాంటి కళ్లతో బయటికి వచ్చారు. మళ్లీ అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానంటూ శపథం చేశారు. 
 
సినీ నటిగా ఉన్నప్పటినుంచీ ఆమెకు ప్రయాణాల్లో, విదేశీ పర్యటనలకి వెళ్లేటప్పుడు పుస్తకాలు వెంట తీసుకెళ్లడం జయకు అలవాటు. చదవడమే కాదు, జీవితంలో వివిధ సందర్భాల్లో తాను చదివినవి గుర్తు చేసుకోవడం.. వాటిని తన నిజ జీవితానికి అన్వయించుకుని చూసుకోవడం ఆమె అలవాటు. ఇతిహాసాలు, పురాణాలంటే అమ్మకు మరింత ఇష్టం. ఇలా డీఎంకే కార్యకర్తలు అసెంబ్లీలో తనపై చేసిన దాడిని కూడా మహాభారత ఘటనతో పోలుస్తూ ఓసారి చెప్పారు. డీఎంకే కార్యకర్తలు చేసిన దాడికి.. ఎన్టీఆర్‌ పాడి వినిపించిన పద్యం ఆయన గళంలోనే మారుమోగిందట.
 
జయలలిత మాటల్లోనే చెప్పాలంటే.. 'ఎన్టీఆర్‌ గారితో సినిమా చేసినప్పుడు ఆయన ఫ్రీ టైమ్‌లో లొకేషన్‌లో తెలుగు నుడికారం, సాహిత్యం గురించి చెప్తుండేవారు. అప్పుడు ఒకసారి 'ద్రౌపదీ వస్త్రాపహరణం' గురించి చెబుతూ.. తనకి భీముడి పాత్ర ఎందుకు ఇష్టం అంటే ఒక అన్యాయం కళ్ల ముందు జరిగినప్పుడు వెంటనే ప్రతిస్పందించి ప్రతిజ్ఞ చేశాడని చెబుతూ.. 'కురువృద్ధులు గురువృద్ధ బాంధవులనేకుల్‌ చూచుచుండ.. ద్రౌపదినిట్లు చేసిన ఖలున్‌' అంటూ ఒక పద్యం చెప్పారు. 
 
అదే గుర్తొచ్చింది. ఆ రోజు భీముడిలో ఉన్న ఆవేశం నాలో కూడా వచ్చింది. నేను ఆ ఆవేశాన్ని నియంత్రించుకుని, నన్ను అవమానించిన వారిని పదవి నుంచి తొలగించేలా న్యాయపోరాటం చేయడానికి ప్రణాళికతో వాడుకున్నాను' అని జయలలిత చెప్పుకున్నారు.