ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 నవంబరు 2016 (15:07 IST)

పాకిస్థాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తున్న భారత జవాన్లు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత

భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. పాకిస్థాన్ రేంజర్లు యధేచ్చగా కాల్పులు విరమణ ఒప్పందాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. దీనికి భారత జవాన్లు కూడా ధీటుగా స్పందిస్త

భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. పాకిస్థాన్ రేంజర్లు యధేచ్చగా కాల్పులు విరమణ ఒప్పందాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. దీనికి భారత జవాన్లు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ స్పందిస్తూ 'పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడులు చేశాం. వాళ్ళకి భారీ నష్టం జరిగింది. ఎందరు మరణించారో స్పష్టమైన సంఖ్య మాత్రం చెప్పలేం' అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ దళాలు పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటంతో భారతీయ దళాలు ధీటుగా ఎదురు దాడి చేస్తున్నాయన్నారు. 
 
తమ దాడుల్లో సుమారు 14 పాకిస్థానీ పోస్టులు ధ్వంసమయ్యాయన్నారు. భారత దళాల ప్రతీకార దాడులు అత్యంత ఖచ్చితత్వంతో జరిగాయని, పాకిస్థాన్‌కు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని వివరించారు. అయితే భారత దళాలు పాకిస్థాన్‌లోని పౌరులపై దాడి చేయలేదని స్పష్టం చేశారు. అయితే, పాక్ రేంజర్లు తాజాగా జమ్మూ-కాశ్మీరులోని నౌషేరా సెక్టర్‌లో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు పౌరులు గాయపడ్డారు.