శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (10:49 IST)

తమిళనాడులో కొత్త పార్టీ.. 'అమ్మ డీఎంకే' ఆవిర్భావం, ఇక సినిమా చూపిస్తాం!

తమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ద్రావిడ ఇయక్కంలో ఒక్కప్పుడు కీలక నేతగా ఎదిగిన ఈవీకే (ఇళంగోవన్) సంపత్ కుమార్ సోదరుడు ఇనియన్ సంపత్ అమ్మ డీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయ

తమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ద్రావిడ ఇయక్కంలో ఒక్కప్పుడు కీలక నేతగా ఎదిగిన ఈవీకే (ఇళంగోవన్) సంపత్ కుమార్ సోదరుడు ఇనియన్ సంపత్ అమ్మ డీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే, ఈ పార్టీ పేరు అందరిని గందరగోళానికి గురిచేసే అవకాశం ఉంది. 
 
దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీని ఆంగ్లంలో ఏఐఏడీఎంకే అంటూ జాతీయస్థాయిలో పిలుస్తారు. అయితే తమిళనాడులో మాత్రం ఇప్పటికీ ఏడీఎంకే అని పిలుస్లుంటారు. పార్టీ కార్యకర్తలు సైతం ఎప్పుడూ ఏడీఎంకే అని పిలుస్తుంటారు. 
 
ఇప్పుడు ఇనియన్ సంపత్ కుమార్ స్థాపించిన పార్టీకి అమ్మ డీఎంకే పార్టీ అని పెట్లారు. దీనిని ఆంగ్లంలో ఏడీఎంకే (అమ్మ డీఎంకే) అని పిలుస్తున్నారు. అమ్మ జయలలిత సేవల్ని ఆకర్షించే విధంగా, అన్నాడీఎంకేలో గందగోళాన్ని రేకెత్తించే విధంగా అమ్మ డీఎంకే పార్టీని స్థాపించారు.
 
అన్నాడీఎంకే జెండాను పొలిన జెండాను ఇలియన్ సంపత్ చెన్నైలోని తన ఇంటిపై ఎగరవేశారు. అన్నాడీఎంకే పార్టీ జెండాపై రెండాకుల చిహ్నం ఉన్న విషయం తెలిసిందే. అయితే అమ్మ డీఎంకే పార్టీ జెండా మీద జయలలిత విక్టరీ సంకేతంతో చిహ్నాన్ని పొందుపరిచారు. మొత్తం మీద అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను గందరగోళంలో పడేసే విధంగా అమ్మడీఎంకే పార్టీ ఆవిర్భవించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.