శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 13 డిశెంబరు 2016 (18:10 IST)

డిసెంబర్ మాసం తమిళనాడు పాలిట శాపమా.....

డిసెంబర్ మాసం తమిళనాడు రాష్ట్రానికి కలిసిరాని మాసమేనని చెప్పాలి. ఆనాడు ఎంజీఆర్.. ఇటీవల జయలలిత కూడా ఈ మాసంలోనే కన్నుమూశారు. నటుడి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ఎంజీఆర్ డిసెంబర్ 24, 1987న కన్నుమూశారు. జయలలిత డిసెంబర్ 5, 2016న తుదిశ్వాస విడిచిన విషయం విదితమ

డిసెంబర్ మాసం తమిళనాడు రాష్ట్రానికి కలిసిరాని మాసమేనని చెప్పాలి. ఆనాడు ఎంజీఆర్.. ఇటీవల జయలలిత కూడా ఈ మాసంలోనే కన్నుమూశారు. నటుడి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ఎంజీఆర్ డిసెంబర్ 24, 1987న కన్నుమూశారు. జయలలిత డిసెంబర్ 5, 2016న తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. వీరిద్దరూ కూడా తీవ్ర అస్వస్థతకు గురై కొంతకాలం పాటు చికిత్స పొందుతూ మరణించారు.
 
ఇక సి. రాజగోపాలచారి (చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా) డిసెంబర్ 25, 1972న, హేతువాద నాయకుడు పెరియార్ ఇ.వి రామస్వామి డిసెంబర్ 24, 1972న మృతి చెందారు. ప్రముఖులే కాదు.. డిసెంబర్ 26, 2004న వచ్చిన సునామీ వేలాదిమందిని పొట్టనబెట్టుకుంది. డిసెంబర్, 2015లో వచ్చిన భారీ వర్షాలకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. 
 
ప్రస్తుతం వార్ధా తుఫాన్ ధాటికి తమిళనాడు రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. జరిగిన ఈ పరిణామాలు గమనిస్తుంటే నిజంగానే డిసెంబర్ మాసం తమిళనాడు రాష్ట్రానికి అచ్చుబాటు గానీ మాసమేనని అనిపించకమానదు.