బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 జనవరి 2017 (14:02 IST)

జయలలితకు 75 రోజుల చికిత్స రెండు కాళ్లు తొలగించారట.. సోషల్ మీడియాలో రచ్చ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఊపిరితిత్తుల సమస్యతో చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి.. గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు వైద్యం అందించే దిశగా ఆమెకు రెండు కాళ్లను తొలగించారంటూ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఊపిరితిత్తుల సమస్యతో చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి.. గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు వైద్యం అందించే దిశగా ఆమెకు రెండు కాళ్లను తొలగించారంటూ ఒక వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

75 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం కార్డియాక్ అరెస్ట్ కారణంగా జయలలిత తుదిశ్వాస విడిచారు. అమ్మ మృతిపై పలు అనుమానాలున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. 
 
సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను సాక్ష్యంగా చూపిస్తూ ‘అమ్మ’ రెండు కాళ్లను తొలగించారని వార్తలొస్తున్నాయి. జయలలిత ఆరోగ్యం ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న సమయంలో ఆమె ప్రాణాలను నిలిపేందుకు వైద్యులు ఆమె రెండు కాళ్లను తొలగించారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆమె మృతిపై నిష్పాక్షిక విచారణ జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను జయలలిత నెచ్చెలి శశికళ చేపట్టిన సంగతి తెలిసిందే. జయలలిత ఇంత కాలం ఉపయోగించిన కారులోనే నెచ్చెలి శశికళ ప్రయాణం మొదలైంది.