శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (18:40 IST)

జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి పట్ల మిస్టరీ వీడలేదు. జయమ్మ మృతికి గల అసలు కారణాలేంటో ఇప్పటికీ తెలియరాలేదు. తాజాగా అపోలో ఆస్పత్రి వైద్యులు అమ్మ మృతి పట్ల అసలు కారణాలను వివరించారు. మెదడుకి రక్తం సరఫరా జరగకపోవడం వల్లే ఆమె మరణించారని అపోలో ఆస్పత్రిలో పనిచేసే ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుందర్ తెలిపారు. 
 
దాదాపు 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన జయలలిత డిసెంబర్ ఐదో తేదీన చనిపోగా, ఆరో తేదీన ప్రజలకు తెలియజేశారని సుందర్ తెలిపారు. జయ మృతి పట్ల విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. జయ మరణానికి అసలు కారణాలను సుందర్ వివరించారు. 
 
జయలలితకు ముందు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారని, ఆమెకు ఈసీఎంవో చేశామని.. ఆ తర్వాత ఆమె మెదడుకు రక్తం సరఫరా ఆగిపోయిందని.. ఈ కారణం చేతనే జయలలిత మరణించినట్లు చెప్పారు.