సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 22 నవంబరు 2018 (12:12 IST)

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత‌గా నిత్యామీన‌న్.!

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్ర ఆధారంగా ది ఐర‌న్ లేడీ అనే టైటిల్ తో సినిమా రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. జ‌య‌ల‌లిత పాత్ర‌ను ఎవ‌రు పోషించ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. 
 
అయితే... ఈ చిత్రంలో జయలలిత పాత్రలో నిత్య మీనన్ నటించనుందని స‌మాచారం. ప్రస్తుతం ఈ పాత్ర కోసం ఆమె బరువు పెరిగే పనిలో వున్నారు. త్వ‌ర‌నే ఈ చిత్రం ప్రారంభించ‌నున్నారు. అయితే... తమిళుల ఆరాధ్య దైవమైన అమ్మ పాత్రలో నటించడం అంటే నిత్య మీనన్‌కు ఒక స‌వాలే. ప్ర‌స్తుతం నిత్యామీన‌న్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో సావిత్రి పాత్ర పోషిస్తుంది. మ‌రి..జ‌య‌ల‌లిత పాత్ర‌లో ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.